వినియోగదారుల హక్కుల.. అవగాహన సదస్సు

by Geesa Chandu |   (  Updated:2024-08-18 07:20:01  IST  )

వినియోగదారులకు అనేక హక్కులు, చట్టాలు ఉన్నాయని, మోసపోయినప్పడు వాటిని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసెల్ కమీషన్ అధ్యక్షురాలు ఎం.అనురాధ అన్నారు.

వినియోగదారుల హక్కుల.. అవగాహన సదస్సు
X

దిశ, మహబూబ్ నగర్: వినియోగదారులకు అనేక హక్కులు, చట్టాలు ఉన్నాయని, మోసపోయినప్పడు వాటిని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసెల్ కమీషన్ అధ్యక్షురాలు ఎం.అనురాధ అన్నారు. శనివారం 'జాతీయ వినియోగదారుల హక్కుల కమీషన్' కార్యాలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'వినియోగదారుల హక్కుల అవగాహన' కార్యక్రమానికి ఆమె, స్థానిక డిఎస్పీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథితులుగా పాల్గొని ప్రసంగించారు. వస్తువులు,సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్చత, ధర, ప్రమాణం వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు వినియోగదారునికి ఉందని ఆమె అన్నారు. వ్యాపారంలోని అనుచిత పద్ధతుల బారిన పడకుండా వినియోగదారులను కాపాడుకోవలసిన బాధ్యత, వారి హక్కులను తెలపాల్సిన బాధ్యత కమీషన్ కు ఉంటుందని ఆమె అన్నారు. డిఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను రక్షించేందుకు దేశంలో బలమైన చట్టాలుఉన్నా, వినియోగదారుల వాస్తవ దురవస్థ నిరుత్సాహంగా ఉందన్నారు. 1986 లో వచ్చిన వినియోగదారుల రక్షణ చట్టం అత్యంత ముఖ్య చట్టం అని, ఈ చట్టం ప్రకారం, ప్రతి ఒక్కరూ వస్తువుల నాణ్యత, ధర, బరువు, తయారీ పై ప్రశ్నించే హక్కును పొందుతారని ఆయన వివరించారు. అంతకుముందు వినియోగదారుల హక్కుల కరపత్రంను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ ఎం.అప్పయ్య, వినియోగదారుల న్యాయవాదులు విజయలక్ష్మీ, చంద్రశేఖర్, అధ్యక్షుడు బి.బాల్ రాజ్, శివశంకర్, చందు, మల్లికార్జున్, సత్యనారాయణ, ఎ.రాజసింహుడు, రామకొండ, రషీద్ పర్వేస్, శ్రీనివాసులు, లలిత తదితరులు పాల్గొన్నారు.

Next Story