అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకొండి : డీటీఎఫ్ అధ్యక్షుడు రవీందర్ గౌడ్

by Ratna Kumari |

జిల్లాలో అనుమతులు లేకుండా అనేక పాఠశాలలు నడుస్తున్నాయని వెంటనే చర్యలు చేపట్టాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవీందర్ గౌడ్, ప్రభాకర్ లు కోరారు.

అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకొండి : డీటీఎఫ్ అధ్యక్షుడు రవీందర్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లాలో అనుమతులు లేకుండా అనేక పాఠశాలలు నడుస్తున్నాయని వెంటనే చర్యలు చేపట్టాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవీందర్ గౌడ్, ప్రభాకర్ లు కోరారు. నూతన జిల్లా విద్యాశాఖ అధికారిణి గా బాధ్యతలు చేపట్టిన విజయ కుమారి ని డిఇఓ కార్యాలయంలో కలిసి బొకే, డిటీఎఫ్ డైరీని అందజేసి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. అనుమతులు లేని విద్యా సంస్థల వల్ల విద్యార్థుల విద్యా ప్రమాణాలు దెబ్బతుంటున్నాయని, అధిక ఫీజు వసూళ్లు, యూనిఫాం, బుక్స్, నోట్ బుక్స్ ల పేర డబ్బులకై తల్లిదండ్రులను పీడిస్తున్నారని వారు ఆరోపించారు. మహబూబ్ నగర్ పట్టణంలో 9 పాఠశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, ఆ భవన యజమానులు పాఠశాలలను ఖాళీ చేయాలనే వత్తిడి తేస్తున్నారని, కనుక శాశ్వత భవనాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. భూత్పూర్ మండలం బట్టుపల్లి తండాలో ఒక ఇంటి శ్లాబ్ కింద పాఠశాల నడుస్తుందని, ఆ ఇంటి యజమాని కూడా ఖాళీ చేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే లను సంప్రదించి శాశ్వత భవనాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఎండి రఫీ, శాంతకుమారి, సృజన, కురుమయ్య, ఓంకార్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కె. వామన్ కుమార్, సంధ్యారాణి, జిల్లా కౌన్సిల్ మెంబర్ కే.సీ. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Next Story