- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా కూతురిని వేదిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి
దిశ, నాగర్ కర్నూల్ : ఆయన ఒక గ్రామానికి మాజీ సర్పంచ్... ఆయన పలుకుబడి, అండతో ఆయన అల్లుడే కాదు.. ఆయన వద్ద పనిచేసే జీతగాడు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తన మామ మాజీ సర్పంచ్,

దిశ, నాగర్ కర్నూల్ : ఆయన ఒక గ్రామానికి మాజీ సర్పంచ్... ఆయన పలుకుబడి, అండతో ఆయన అల్లుడే కాదు.. ఆయన వద్ద పనిచేసే జీతగాడు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తన మామ మాజీ సర్పంచ్, నన్నెవరూ ఏమీ చేయలేరంటూ గ్రామంలో ఆడవాళ్లపై కన్నేయడం, కంటికి నచ్చిన ఆడవాళ్లను బయపెట్టి లొంగదీసుకోవడం చేస్తున్నారు. ఇటీవల ఆయన అల్లుడు గ్రామానికి చెందిన ఓ మహిళను బలత్కారం చేయడమే కాకుండా తనకు ఇష్టం వచ్చినప్పుడు ఆ మహిళ వద్దకు వస్తానని ఏమీ చేయలేరని ఏకంగా ఆ మహిళ తండ్రిని భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో ఆ గ్రామ మాజీ సర్పంచ్, ఆయన అల్లుడి ఆగడాలు, ఆడవాళ్లపై దౌర్జన్యాలు తట్టుకోలేక న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం ప్రకారం... వివరాల్లోకి వెళ్లితే.. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండ గ్రామానికి చెందిన వట్టెం ఈశ్వరయ్య మొదటి కుమార్తె పై ఇదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అల్లుడు లవ కన్నేశాడు. తన మామ ప్రజాప్రతినిధి అని తనను ఎవ్వరు ఏమీ చేయలేరని దౌర్జన్యంగా తన మొదటి కుమార్తెను లవ రెండు రోజుల క్రితం బాత్ రూంలోకి దౌర్జన్యంగా లాక్కొని వెళ్లి శారీరకంగా, లైంగికంగా దాడి చేశాడని ఆయన ఆరోపించారు. తనకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి లైంగికంగా బలాత్కారం చేస్తానని ఎవ్వరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని వట్టెం ఈశ్వరయ్య తెలిపాడు. రెండు సంవత్సరాల క్రితం తన భార్య కురువమ్మ ను కూడా మాజీ సర్పంచ్ శ్రీశైలం ఇంట్లో పనిచేసే జీతగాడు ఆయన అండ చూసుకొని వేధించి తనకు కాకుండా చేశాడని ఆరోపించారు. తన కుంటుంభంలోని ఆడవాళ్లపై కన్నేసి శారీరకంగా, మానసికంగా వేదిస్తున్న మాజీ సర్పంచ్ శ్రీశైలం, అతని అల్లుడు లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ మేరకు బిజినేపల్లి పోలీసులకు బాధితుడు వట్టెం ఈశ్వరయ్య వారిద్దరి పై చట్టం ప్రకారం చర్యలు తీసుకోని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.






