తాఫీ మేస్త్రి ఆత్మహత్య

by Nallavelli.Anjaneyulu |

దిశ, నవాబుపేట : తాపీ మేస్త్రీగా ప‌ని చేసే వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న న‌వాబ్ పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై విక్ర‌మ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల

తాఫీ మేస్త్రి ఆత్మహత్య
X

దిశ, నవాబుపేట : తాపీ మేస్త్రీగా ప‌ని చేసే వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న న‌వాబ్ పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై విక్ర‌మ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని వెంక‌టేశ్వ‌ర తండా గ్రామపంచాయ‌తీ స‌మీపంలోని ఎర్ర‌వాడుక తండాకు చెందిన తాఫీ మేస్త్రీ విస్లావ‌త్ పాండు (45) అప్పుల భారం అధికం కావ‌డంతో ఆందోళ‌న కు గురై ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పాండు కి భార్య మంగ‌మ్మ‌తో పాటు ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె ఉంది. వీరి కుటుంబం సుమారు రూ.5ల‌క్ష‌ల వ‌ర‌కు అప్పు చేసింది. అప్పులు తీర్చేందుకు 8 నెల‌ల కింద‌ట భార్య‌, పిల్ల‌ల‌ను తీసుకొని రంగారెడ్డి జిల్లా షాద్ న‌గ‌ర్ కి వ‌ల‌స వెళ్లాడు. అక్క‌డ తాఫీ మేస్త్రీ ప‌నులు చేసుకుంటూ జీవిస్తుండేవాడు.

పనిమీద బయటకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి శుక్రవారం సాయంత్రం తన సొంత గ్రామానికి చేరుకున్న పాండు శనివారం ఉదయం 11 గంటల సమయంలో గ్రామ సమీపంలో గల ఓ వ్యక్తి వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసు చేసుకున్నాడు. గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తికి కనిపించాడు. అది చూసిన ఆయన వెంటనే ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. వచ్చి చూసిన భార్య మంగమ్మ తన భర్త మృతికి తమకు గల అప్పులే కారణమని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఎమ్.విక్రమ్ తెలిపారు.

Next Story