- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహ వేడుకలకు హాజరైన స్వీడన్ వాసులు
ఇండియన్ సంప్రదాయ రీతిలో వివాహ వేడుకలకు హాజరైన స్వీడన్ వాసుల ఫోటోలు వైరల్ అయ్యాయి.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : మన సంస్కృతి, సాంప్రదాయాలను మరిచిపోతుండగా విదేశీయులు మాత్రం మన సంప్రదాయాలను గౌరవిస్తున్న సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇందులో భాగంగా బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన వివాహ వేడుకలకు స్వీడన్ దేశానికి చెందిన జోహాన, కోబ్రా మన సాంప్రదాయ దుస్తులు ధరించి హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. వివరాలలోకి వెళితే భూత్పూర్ మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన రాచమోని రఘువంశ కుమార్ , సౌమ్య వివాహం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. రఘువంశ్ ప్రముఖ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
అదే కంపెనీలో స్వీడన్ కు చెందిన జోహన, కోబ్రా కూడా పనిచేస్తూ ఉన్నారు. భారతదేశంలో పాటు చైనా, సింగపూర్ తదితర దేశాలలో వీరందరూ కలిసి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారి మధ్య ఉన్న స్నేహబంధంతో రఘువంశ కుమార్ , సౌమ్య వివాహ వేడుకలకు స్వీడన్ వాసులు హైందవ సాంప్రదాయం ప్రకారము పంచ కట్టు, చీర కట్టు తో హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. వివాహానికి హాజరైన ప్రముఖులతో కలిసి కొత్తజంటతో జోహన, కోబ్రా ఫోటోలు దిగి సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు కోబ్రా, జోహాన తో కలిసి ఫోటోలు దిగారు. విదేశీయులు మన సంప్రదాయాన్ని పాటిస్తుంటే.. మనం మాత్రం విదేశీయుల సంప్రదాయాలను పాటిస్తున్నాము అని పలువురు చర్చించుకున్నారు.






