కాంగ్రెఎస్ నాయ‌కుల‌పై త‌ప్పుడు ప్ర‌చారం త‌గ‌దు : ఎల్లే పోగుల సువర్ణ ఆంజనేయులు

by Ratna Kumari |

దిశ, గోపాల్ పేట : సూర్యుడి కంటిలో మ‌న్ను చ‌ల్లితే తిరిగి మ‌న కంటిలో ప‌డిన‌ట్టు బీఆర్ఎస్

కాంగ్రెఎస్ నాయ‌కుల‌పై త‌ప్పుడు ప్ర‌చారం త‌గ‌దు : ఎల్లే పోగుల సువర్ణ ఆంజనేయులు
X

దిశ, గోపాల్ పేట : సూర్యుడి కంటిలో మ‌న్ను చ‌ల్లితే తిరిగి మ‌న కంటిలో ప‌డిన‌ట్టు బీఆర్ఎస్ స‌ర్పంచ్ అభ్య‌ర్థి ప‌రిస్థితి త‌యారైంది. గోపాల్ పేట మండ‌ల కేంద్రంలో కరోల్ల స్వప్న భాస్కర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పై తప్పుడు ప్రచారం మానుకోవాలని కాంగ్రెస్ ఉమ్మడి మండలాల అధ్యక్షుడు సత్యసిల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. తను చేసిన తప్పులకు పై అధికారులు చర్యలు తీసుకుంటే అది మా పైన నెట్టడం తప్ప అని తెలియజేశారు. కర్రోల్ల స్వప్న భాస్కర్ ఎన్నికల నామినేషన్లో నాకు గాని, నా భర్తకు గాని ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ లేవని పేర్కొన్నారు. వాస్తవానికి అభ్యర్థి భర్త ప్రభుత్వ ఉద్యోగి, ఆమె గృహిణి అయినా, ప్రతి సంవత్సరం ఇన్కమ్ టాక్స్ 8,37,626/-రూపాయలు కట్టినట్లు వారు నామినేషన్ పత్రంలో తెలిపారు. శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యసిల్లారెడ్డి నా భర్త భాస్కర్ ను సస్పెండ్ చేయించారని కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం టిఆర్ఎస్ నాయకులకు తగదని వారి సందర్భంగా గుర్తు చేశారు. నామినేషన్ పత్రంలో ఎలాంటి ఉద్యోగం, వ్యాపారాలు లేవని పేర్కొన్నది నిజమా, శనివారం కలెక్టర్కు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్ అనేది నిజమా ప్రజలే నిర్ణయించుకోవాలని వారు తెలియపరిచారు.గోపాల్పేటలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఎల్లె పోగుల సువర్ణ ఆంజనేయులు చదువుకున్న వ్యక్తి లాయరు సమాజంపై పట్టున్న వ్యక్తి అంబేద్కర్ వారసుడిలా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిగెత్తి సమస్య పరిష్కరించే దిశగా ఉద్యమం చేసే నాయకుడిని మండల ప్రజలు కోల్పోవద్దని ఈనెల 11న జరిగే ఎన్నికల్లో సువర్ణ ఆంజనేయులు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.


గత ప్రభుత్వం 28 లక్షల కోట్ల అప్పు చేసిందని గత పాలనపై ఇరుచుకపడ్డారు.నవంబర్ 27, 28 తేదీలలో ఉద్యోగానికి హాజరు కాలేదు అనే కారణంతో సస్పెండ్ చేస్తున్నామని పత్రిక ప్రకటన ద్వారా హైదరాబాదులో తెలియజేశారు. కానీ అది మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.అది కూడా ఈరోజు కొత్త ఏంకాదు గతంలో చాలా సార్లు ఉద్యోగానికి హాజరుకానందువల్ల హెచ్చరించిన మార్పు రానందువలన సస్పెండ్ చేశారని వారు అన్నారు.ఎన్నికల నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి అయినా ఎలక్షన్ లో పాల్గొనకూడదు, ప్రచారం చేయకూడదు, పోటీ చేయకూడదు. ఇది ఎవరికి మినహాయింపు లేదన్నారు. మా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కొంకలి రవి భార్య జ్యోతి వార్డు మెంబర్ గా పోటీ చేసినందువల్ల ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆమెను కస్తూర్బా పాఠశాల వాచ్మెన్ నుంచి సస్పెండ్ చేశారు అన్నారు. మేము టిఆర్ఎస్ పార్టీ వాళ్లు సస్పెండ్ చేయించారు అని మీలాగా తప్పుడు ప్రచారం చేసుకోవడం లేదన్నారు.ప్రజల అందరికీ తెలుసు ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తే బయట వచ్చి తన కార్యక్రమాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చు కానీ కర్రోల భాస్కర్ ఒకపక్క సస్పెండ్ చేయించారు అని, చెప్పుకుంటూ బయటికి రావటం లేదు అంటే ప్రజలను మోసం చేసి తన ఉద్యోగం తను చేసుకుంటూ సానుభూతి కోసం బయట తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలు వీటిని నమ్మకండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎల్లే పోగుల సువర్ణ మండ్ల ఆంజనేయులుని ఉంగరం గుర్తు పై ఓటు వేసి వేయించి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించగలరని వారు అన్నారు. భవిష్యత్తులో మండల అభివృద్ధి కోసం పాటుపడతానని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు శివన్న, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొంకి వెంకటేష్,జిల్లా ఆర్టిఐ చైర్మెన్ కొంకి రమేష్, కాంగ్రెస్ నాయకులు జి చంద్రశేఖర్, ఎల్ల పోగులు సువర్ణ మoడ్ల ఆంజనేయులు న్యాయవాది, జోగు సంజీవ, యాదవ సంఘం అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, ప్రధాన కార్యదర్శి బొక్కలయ్య, కార్యకర్తలు పాల కేంద్రం వెంకటేష్, నాగరాజు, పర్వతాలు, జోగు భాస్కర్, మల్లేష్ నాయక్, జోగు పెద్ద రాములు పాల్గొన్నారు.

Next Story