పండుగకు ఇంటికొచ్చిన అల్లుడు అనుమానాస్పద మృతి

by Ratna Kumari |

దిశ‌, రేవ‌ల్లి : మండల పరిధిలోని చెన్నారం గ్రామంలో దసరా పండుగకు ఇంటికొచ్చిన అల్లుడు అనుమానాస్పద మృతి చెందిన ఘ‌ట‌న రేవ‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేస‌కుంది.

పండుగకు ఇంటికొచ్చిన అల్లుడు అనుమానాస్పద మృతి
X


దిశ‌, రేవ‌ల్లి : మండల పరిధిలోని చెన్నారం గ్రామంలో దసరా పండుగకు ఇంటికొచ్చిన అల్లుడు అనుమానాస్పద మృతి చెందిన ఘ‌ట‌న రేవ‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేస‌కుంది. ఎస్.ఐ. ర‌జిత తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పానగల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన మృతుడు నరసింహ, శివలీల లు భార్యాభర్తలు. కాగా వీరికి ముగ్గురు పిల్ల‌లు. వారిలో ఇద్ద‌రూ కూతుర్లు, ఒక కుమారుడు క‌ల‌రు. గత రెండు రోజుల కింద‌ట శివలీల భర్తతో తో గొడవపడి ఇద్దరు ఆడపిల్లలను తీసుకొని పుట్టినిల్లు చెన్నారం గ్రామానికి వ‌చ్చింది. పండుగ‌ను పుర‌స్క‌రించుకొని న‌ర‌సింహా త‌న వ‌ద్ద ఉన్న కుమారుడిని తీసుకొని అత్తారింటికి వ‌చ్చాడు. అత్త‌గారింట్లో భార్య‌, పిల్ల‌ల‌తో ఉన్న మృతుడు అర్థ‌రాత్రి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు. విప‌రీత‌మైన వాంతులు చేసుకోవ‌డంతో కుటుంబ స‌బ్యులు వెంట‌నే వ‌న‌ప‌ర్తి ఆసుప‌త్రిక‌కి తీసుకెళ్తుండ‌గా.. మార్గ మ‌ధ్య‌లో మ‌ర‌ణించాడు. ఇంటికి వ‌చ్చిన అల్లుడిని కొట్టి చంపార‌ని మృతుని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తూ.. పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృత‌దేహాన్ని వ‌న‌ప‌ర్తి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి శ‌వ ప‌రీక్ష కోసం త‌ర‌లించారు. రాజీ కుదిర్చేందుకు పెద్ద మ‌నుషులు ప్ర‌య‌త్నించినా రాజీ కుద‌ర‌లేద‌ని స‌మాచారం.

Next Story