- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బలవన్మరణమా..? హత్యా..?
చిన్న రేవల్లి గ్రామంలో యువకుడు పశువుల పాకలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గ్రామాన్ని విషాదంలో ముంచేసింది.

దిశ, బాలానగర్ : చిన్న రేవల్లి గ్రామంలో యువకుడు పశువుల పాకలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. నాలుగు అడుగుల ఎత్తున్న పశువుల పాకలో ఐదున్నర అడుగుల ఎత్తున్న వ్యక్తి ఉరి వేసుకోవడం ఎలా సాధ్యం..? అని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్న రేవల్లికి చెందిన బత్తుల ఆంజనేయులు (32) గురువారం ఉదయం పశువుల పాకలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. అక్కడున్న రైతులు మృతదేహాన్ని గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆంజనేయులకు ఆత్మహత్య చేసుకోవడానికి ఎలాంటి బలమైన కారణాలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో మరణం బలవన్మరణమా..? హత్యా..? అన్న కోణంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న రాజాపూర్ ఎస్సై శివానంద్ క్లూస్ టీమ్‌తో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.






