చెరువులో ప‌డి మ‌హిళా అనుమాన‌స్ప‌ద మృతి

by Nallavelli.Anjaneyulu |

చెరువులో ప‌డి మ‌హిళా అనుమాన‌స్ప‌ద మృతి చెందిన ఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా బిజినేప‌ల్లి మండ‌లం ఖానాపూర్ గ్రామ స‌మీపంలో చోటు చేసుకుంది.

చెరువులో ప‌డి మ‌హిళా అనుమాన‌స్ప‌ద మృతి
X

దిశ‌, బిజినేప‌ల్లి : చెరువులో ప‌డి మ‌హిళా అనుమాన‌స్ప‌ద మృతి చెందిన ఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా బిజినేప‌ల్లి మండ‌లం ఖానాపూర్ గ్రామ స‌మీపంలో చోటు చేసుకుంది. గ్రామ‌స్తులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఖానాపూర్ గ్రామ స‌మీపంలోని చెరువులో గురువారం చెరువులో పడి దగిండ్ల లక్ష్మమ్మ(48) మృతి చెందింది. ఒడ్డుకు రావడంతో గమనించిన స్థానికులు బిజినేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకుని చెరువులో నుంచి బయటకు తీసి పంచనామా చేశారు. మృతురాలికి భర్తతోపాటు నలుగురు సంతానం ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.

Next Story