గంజాయి కేసు నిందితుడి అరెస్ట్.. సెల్‌ఫోన్ స్వాధీనం

by Nallavelli.Anjaneyulu |

గతంలో నమోదైన గంజాయి రవాణా కేసులో పరారీలో ఉన్న నిందితుడిని మహబూబాబాద్ రూరల్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు.

గంజాయి కేసు నిందితుడి అరెస్ట్.. సెల్‌ఫోన్ స్వాధీనం
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : గతంలో నమోదైన గంజాయి రవాణా కేసులో పరారీలో ఉన్న నిందితుడిని మహబూబాబాద్ రూరల్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. రూరల్ సీఐ అంజలి తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కేసులో నిందితుడైన పాయలి క్రాంతికుమార్‌ తన నివాసంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అరెస్టు చేసి అనంతరం విచారణ నిర్వహించి, అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ మాట్లాడుతూ గంజాయి వినియోగం, విక్రయం, రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందితులపై అవసరమైతే పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి సంబంధిత సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

Next Story