తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేసిన సురవరం కృషి గొప్పది

by Ratna Kumari |

తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో సురవరం ప్రతాపరెడ్డి చేసిన కృషి గొప్పదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేసిన సురవరం కృషి గొప్పది
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో సురవరం ప్రతాపరెడ్డి చేసిన కృషి గొప్పదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించి మాట్లాడారు. సురవరం ఒక వర్గానికి, ప్రాంతానికి పరిమితమైన వారు కాదని, ఆయన జీవిత చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ లో కవులే లేరని చెప్పిన రోజున 350 మందికి పైగా కవులతో గోల్కొండ కవుల సంచికను ప్రచురించి విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చారని అన్నారు. తెలంగాణ సాహిత్యానికి జాతీయ స్థాయిలో సురవరం గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు.

ప్రేమ త్యాగం భక్తికి ప్రతీక బక్రీద్..

ప్రేమ, త్యాగం, ఐక్యత, భక్తికి ప్రతీక బక్రీద్ పండుగ అని, అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం న్యూ గంజ్ రోమానియా ఈద్గా వద్ద ముస్లిం సోదరుల ప్రార్థనల అనంతరం వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. తెలంగాణలో కుల మతాల ఐక్యతను పెంచిన ఘనత కేసీఆర్ దేనని, ఆయన హయాంలోనే పండుగలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయని అన్నారు. భక్తి శ్రద్ధలతో జరిపిన ప్రార్థనలు ఫలించాలని ఆయన ఆకాంక్షించారు.

Next Story