ఏసీబీ వలలో జేడీడబ్ల్యూఏ సూపరింటెండెంట్

by Nallavelli.Anjaneyulu |

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని జాయింట్ డైరెక్టర్ అఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న ఈగల మధుసూదన్ ను సోమవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఏసీబీ వలలో జేడీడబ్ల్యూఏ సూపరింటెండెంట్
X

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని జాయింట్ డైరెక్టర్ అఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న ఈగల మధుసూదన్ ను సోమవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. 2022 సెప్టెంబర్ 15 వ తేదీ నుంచి 2023 సెప్టెంబర్ 20 వ తేదీ మధ్య కాలంలో మధుసూధన్ భద్రాద్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లో బినామీ అకౌంట్ ను ఓపెన్ చేసి ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుంచి లంచంగా తీసుకున్న రూ.14.77 లక్షల డబ్బులను ఈ అకౌంట్ కు తరలించినట్టు స‌మాచారం. ఈ మేరకు ఏసీబీ అధికారులు విచారణ జరిపి సోమవారం మధుసూధన్ పని చేస్తున్న ఎల్ఎండి లోని జేడీఏ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు కార్యాలయ ఉన్నంతధికారులకు సమాచారం అందించి మధుసూధన్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఆయనను కరీంనగర్ జిల్లా ఏసీబీ కోర్టులో హాజరు పరచగా మధుసూధన్ కు ఏసీబీ కోర్టు జడ్జి జ్యూడిషియల్ రిమాండ్ కు ఆదేశించారు.

Next Story