- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూత్పూర్ మున్సిపాలిటీలో భార్యాభర్తల విజయం
భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో భార్యాభర్తలు ఇద్దరు విజయం సాధించారు. ఎస్టీ రిజర్వేషన్ కావడంతో భర్తకు చైర్మన్ పదవీ దక్కనుంది.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/భూత్పూర్ : మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపల్ ఎన్నికలలో భార్యాభర్తలు ఇరువురు పోటీ చేసి గెలుపొందారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్టి జనరల్ కు రిజర్వు కావడంతో బీఆర్ఎస్ లో ఉన్న మాజీ వార్డు కౌన్సిల్ సభ్యుడు బాలకోటి అతని భార్య మాధురి కాంగ్రెస్ పార్టీలో చేరి విజయం సాధించారు. బాలకోటి కి చైర్మన్ పదవి ఆఫర్ తో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. బాలకోటి ఎనిమిదవ అవార్డు నుండి పోటీ చేసి బిజెపి అభ్యర్థి ఫారుక్ పై 166 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బాలకోటి భార్య మాధురి ఒకటవ వార్డు నుండి పోటీ చేసి 47 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 10 వార్డులు ఉన్న ఈ మునిసిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 7, బిజెపి 2, బి ఆర్ ఎస్ ఒక స్థానంలో గెలుపొందాయి. పూర్తిస్థాయి మెజారిటీ దక్కిన నేపథ్యంలో బాలకోటి కి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కనుంది.
అభ్యర్థులకు దక్కిన ఓట్ల వివరాలు
1వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి మాధురికి 514 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి సౌజన్యకు 467 , ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి మాధురి 47 ఓట్లతో విజయం సాధించింది. ఈ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి దేవికి 15, బిజెపి అభ్యర్థి మంగకు 10 ఓట్లు దక్కాయి.
2వ వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మల అన్నపూర్ణ కు 442, టిఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు 410 ఓట్లు రాగా ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి అన్నపూర్ణ 42 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. బిజెపి అభ్యర్థి శిబిరం సంధ్యారాణికి 105, స్వతంత్ర అభ్యర్థి డేగవర్తి శాంతికి 57 ఓట్లు వచ్చాయి.
మూడవ వార్డు రిజర్వు స్థానం నుండి బిఆర్ఎస్ నుండి పోటీ చేసిన కాట్రావత్ రాముకు 291 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి లాల్య నాయక్ కు 310 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి సోమలా నాయక్ కు 225 ఓట్లు వచ్చాయి . కాంగ్రెస్ అభ్యర్థి 19 ఓట్లతో ఈ స్థానం నుండి విజయం సాధించాడు. నాల్గవ వార్డులో బి ఆర్ ఎస్ అభ్యర్థి గడ్డం ప్రైమ్ కు 600, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం సాయి ప్రసాద్ కు 456 , బిజెపి అభ్యర్థి మండి మన్నేమయ్యకు 17, స్వతంత్ర అభ్యర్థి బజారు నరసింహులుకు మూడు ఓట్లు లభించాయి. ఈ స్థానము నుండి బి.ఆర్.ఎస్ అభ్యర్థి 144 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఐదవ వార్డు నుండి పెండ్యాల పద్మ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయగా ఆమెకు 489 ఓట్లు, టిఆర్ఎస్ అభ్యర్థి బాలస్వామికి 382, బిజెపి అభ్యర్థి మహానందికి 435 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి 54 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఆరవ వార్డులో బిజెపి అభ్యర్థి కే శ్రీనివాసులు కు 537 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మచ్చేందర్ కు 271, టిఆర్ఎస్ అభ్యర్థి రామకృష్ణ కు 47, బీఎస్పీ అభ్యర్థి గడ్డం రాజుకు 20 ఓట్లు దక్కాయి. బిజెపి అభ్యర్థి శ్రీనివాసులు 266 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఏడవ వార్డు లో బిఆర్ఎస్ అభ్యర్థి తెల్లారి స్వాతి కి 218, బిజెపి అభ్యర్థి సూరన్న గారి లత కు 414, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవికి 350 3 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో బిజెపి అభ్యర్థి 61 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బాలకోటి కి 427 ఓట్లు, బి ఆర్ ఎస్ అభ్యర్థి అజీజ్ కు 188, బిజెపి అభ్యర్థి ఫారూఖ్ కు 261 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి బాలకోటి 166 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రకళ 560, బిజెపి అభ్యర్థి మోతి 49, టిఆర్ఎస్ అభ్యర్థి సంధ్య లావుడియాకు 395 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థులు పట్ల వత్తు నాలుగు, సభావతి శిరీష కు ఒక్క ఓటు లభించింది. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి 165 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. 10 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి లిక్కి సూర్య కళ కు 606, బి.ఆర్.ఎస్ కడప పద్మ కు 350, బిజెపి అభ్యర్థి డి లక్ష్మికి 23 ఓట్లు రాగా మరో స్వతంత్ర అభ్యర్థి నజీం బేగంకు 10 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సూర్య కళ 256 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.






