త్వ‌ర‌లోనే స‌బ్ స్టేష‌న్ ప‌నులు ప్రారంభం : మంత్రి వాకిటి శ్రీహ‌రి

by Nallavelli.Anjaneyulu |

నియోజకవ‌ర్గంలో రూ.70కోట్ల‌తో నిర్మించ‌నున్న 220 కేవీ స‌బ్ స్టేష‌న్ కోసం స్థ‌లాన్ని బుధ‌వారం మంత్రి వాకిటి శ్రీహ‌రి ప‌రిశీలించారు.

త్వ‌ర‌లోనే స‌బ్ స్టేష‌న్ ప‌నులు ప్రారంభం : మంత్రి వాకిటి శ్రీహ‌రి
X

దిశ‌, మ‌క్త‌ల్ : నియోజకవ‌ర్గంలో రూ.70కోట్ల‌తో నిర్మించ‌నున్న 220 కేవీ స‌బ్ స్టేష‌న్ కోసం స్థ‌లాన్ని బుధ‌వారం మంత్రి వాకిటి శ్రీహ‌రి ప‌రిశీలించారు. కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కం న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో ఉన్న లిప్ట్ ఇరిగేష‌న్ కి ప్ర‌స్తుతం మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి చెందుతున్న అవ‌స‌రాల‌కు రాబోయే కాలంలో ముందు చూపుతో 220 కేవీ స‌బ్ స్టేష‌న్ ఏర్పాటు చేయాల‌ని మంత్రి దృష్టికి తీసుకెళ్ల‌గా.. రూ.70 కోట్లు నిధులు మంజూరు చేయించారు. ప్ర‌స్తుతం ఉన్న 132 కేవీ స‌బ్ స్టేష‌న్ స్థ‌లంలో 220 టీవీ స‌బ్ స్టేష‌న్ కి అభివృద్ధి చేయాల‌ని న‌ర్వ మండ‌లంలో క‌రెంట్ క‌ష్టాలు ఉండ‌టంతో 132 కేవీ స‌బ్ స్టేష‌న్ కి బ‌దిలీ చేస్తున్నామ‌ని తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో 220 స‌బ్ స్టేష‌న్ ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లో భాగంగా మంత్రి వాకిటి శ్రీహ‌రి నూత‌నంగా ఏర్పాటు చేయ‌బోతున్న స‌బ్ స్టేష‌న్ కోసం స్థ‌లాన్ని ప‌రిశీలిస్తున్నారు. మ‌క్తల్ ప‌ట్ట‌ణంలో హైవేకు ఆనుకొని స్థ‌లంలో భ‌విష్య‌త్ లో అభివృద్ధి అయ్యే అవ‌కాశం ఉండ‌టంతో ఇప్ప‌టికే 150 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి, ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్ ఏర్పాటు, నూత‌న కోర్టు భ‌వ‌నం అందుబాటులో రావ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌న్నారు. త్వ‌ర‌లోనే ప‌నులు ప్రారంభం అవుతాయ‌ని అధికారుల‌తో మంత్రి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో త‌హ‌శీల్దార్ స‌తీష్ కుమార్, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీరామ్, ఇంజినీర్ నాగ‌శివ‌, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ర‌వికుమార్, గ‌ణేష్ కుమార్ ఉన్నారు.

Next Story