- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి , సర్పంచ్ శంకర్ ముదిరాజ్ అన్నారు.

దిశ, మిడ్జిల్ : విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి , సర్పంచ్ శంకర్ ముదిరాజ్ అన్నారు. మండల కేంద్రంలోని శుక్రవారం కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో వీడ్కోలు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ప్రభుత్వం వసతిగృహాలలో సౌకర్యాలు వినియోగించుకొని విద్యార్థులు చక్కగా చదువుకోవాలని తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలని తల్లిదండ్రులకు, కేజీబీవీ కి మంచిపేరు తీసుకురావాలన్నారు. సమయపాలన, కార్యదీక్షత వంటి మంచి లక్షణాలు అలవర్చుకొని పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆశించారు. మంచి మార్కులతో త్రిబుల్ ఐటీ లో విద్యార్థులు ప్రవేశాలు పొందాలని కోరారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మమత, కేజీబీవీ ఎస్ఓ కవిత, మాజీ ఎంపీటీసీ గౌస్ నాయకులు బరిగెల వెంకటయ్య, బాల్ రెడ్డి, రమేష్, శివ, ఆంజనేయులు , నరసింహ, మన్యం కేజీబీవీ ఉపాధ్యాయులు ఉన్నారు.






