- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పై కప్పు పెచ్చులూడి విద్యార్థికి గాయాలు
by velandi.Saikiran |
కప్పు పెచ్చులూడి విద్యార్థికి తలపై గాయమైన సంఘటన మక్తల్ పట్టణంలోని జూనియర్ కాలేజీలో బుధవారం జరిగింది.

X
దిశ, మక్తల్ : తరగతి గదిలో పై కప్పు పెచ్చులూడి విద్యార్థికి తలపై గాయమైన సంఘటన మక్తల్ పట్టణంలోని జూనియర్ కాలేజీలో బుధవారం జరిగింది. బాధిత విద్యార్థిని ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోమని, తమకేం సంబంధం లేదంటూ కాలేజీ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనిపై తోటి విద్యార్థులు మండిపడుతున్నారు. కాలేజీలోని టాయిలెట్ల దగ్గర కందిరీగలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని సీరియస్ అవుతున్నారు. అటు ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవరించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






