భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మరణంపై విచారణ

by Pulgam srinivas |

ఈ నెల 22న భూపాలపల్లి ఆర్టీఓ ఆఫీస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మృతిపై బుధవారం విచారణ కొనసాగింది. ఈ ఘటనపై విచారణకై ప్రభుత్వం నియమించిన జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చంద్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో విచారణ జరిగింది.

భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మరణంపై విచారణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 22న భూపాలపల్లి ఆర్టీఓ ఆఫీస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మృతిపై బుధవారం విచారణ కొనసాగింది. ఈ ఘటనపై విచారణకై ప్రభుత్వం నియమించిన జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చంద్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఘనపూర్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారులతో జేటీసీ సమావేశమయ్యారు. సంఘటన కు సబంధించి పోలీసులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు వివరాలను సీఐ కరుణాకర్ రావు, ఎస్ఐ అశోక్ ను అడిగి తెలుసుకున్నారు. తర్వాత లారీ డ్రైవర్, లారీ ఓనర్, హార్వెస్టర్ డ్రైవర్ ను విచారించారు. జెన్ కో అధికారులతో సమావేశమై ఘటన జరిగిన రోజున లారీలో ఏ స్థాయిలో బొగ్గును రవాణా చేస్తుతున్నారనే వివరాలు తెలుసుకున్నారు.

తర్వాత సంఘటనా స్థలానికి చేరుకుని నలుగురు ప్రత్యక్ష సాక్షులను విచారించారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి సంఘటన జరిగిన పరిస్థితులను విశ్లేషించారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. తర్వాత బొగ్గు లోడింగ్ పాయింట్ అయిన తాడిచర్లకు వెళ్లి అక్కడ ఓపెన్ కాస్ట్ ప్రతినిధులతో సమావేశమై యాక్సిడెంట్ కు కారణమైన లారీ లోడ్ రికార్డులను పరిశీలించారు. విచారణ అధికారితో పాటు మోటారు వాహన తనిఖీ అధికారులు జంగ్లీ శ్రీనివాస్, శివపల్లి శ్రీనివాస్, బారగాడి శ్రీనివాస్, ఘన్ పూర్ సీఐ కరుణాకర్ రావు, ఎస్ఐ అశోక్, భూపాలపల్లి ఏఎంవీఐలు ఫాహిమా సుల్తానా, సుందర్ లాల్, శ్రీనివాస్ ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో సంఘటనకు సంబంధించిన ప్రాథమిక నివేదిక వివరాలను రవాణా కమిషనర్ కు అందజేయనున్నారు.

Next Story