యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘తెల్ల కాగితం’ ఫస్ట్ సింగిల్

by Mallepaka Hamsa |

‘తెల్ల కాగితం’ చిత్రంలో ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు.

యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘తెల్ల కాగితం’ ఫస్ట్ సింగిల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో హర్ష రోషన్, దర్శకుడు రమేష్ బండ్రెడ్డి కాంబినేషన్‌లో రాబోతున్న సరికొత్త యూత్‌ఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ ‘తెల్ల కాగితం’. ఈ చిత్రంలో హర్ష రోషన్ సరసన నక్షత్ర హీరోయిన్‌గా నటిస్తోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘బేబీ’ సినిమాతో సౌత్ ఇండియాలోనే సెన్సేషన్ సృష్టించిన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ డోస్ పెంచుతూ తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభించింది. ఇందులో భాగంగా ‘తెల్ల కాగితం’ చిత్రంలో ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ‘‘చిలక’ అని సాగే ఈ పాట మనసులో నిలిచిపోయేలా మృదువుగా, ఆహ్లాదకరంగా సాగే, కళాశాల నేపథ్యంలో సాగే ఒక చక్కని ప్రేమ గీతం’’ అనే క్యాప్షన్‌తో ఈ పాటను వదిలారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ లవ్ సాంగ్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా మంచి వ్యూస్‌తో ట్రెండింగ్‌గా మారింది.



Next Story