ఇంట‌ర్ ఫ‌లితాల్లో వీప‌న‌గండ్ల విద్యార్థి స్టేట్ ఫ‌స్ట్ ర్యాంకు

by Nallavelli.Anjaneyulu |

మండల కేంద్రానికి చెందిన జొల్లూ నిఖిల్ ఇంటర్మీడియట్ మొద‌టి సంవ‌త్స‌రంలో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంక్ సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు.

ఇంట‌ర్ ఫ‌లితాల్లో వీప‌న‌గండ్ల విద్యార్థి స్టేట్ ఫ‌స్ట్ ర్యాంకు
X

దిశ‌, వీప‌న‌గండ్ల : మండల కేంద్రానికి చెందిన జొల్లూ నిఖిల్ ఇంటర్మీడియట్ మొద‌టి సంవ‌త్స‌రంలో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంక్ సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. మొత్తం 470 మార్కులకు 468 మార్కులు సాధించి తన ప్రతిభను చాటాడు. నిఖిల్ ప్రస్తుతం నారాయణ జూనియర్ కాలేజీ, రావిర్యాలాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చిన్న వయస్సులోనే క్రమశిక్షణతో చదువుకుని ఈ అరుదైన విజయాన్ని అందుకోవడం విశేషం. అతని విజయంతో కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ తండ్రి జొల్లూ గంగన్న, తల్లి గిక్కి శ్యామల ఇద్దరూ ఉపాధ్యాయులే కావడం గమనార్హం. వారి మార్గదర్శకత్వం, ప్రోత్సాహం వల్లే నిఖిల్ ఈ స్థాయి విజయాన్ని అందుకున్నాడని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రముఖులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు నిఖిల్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

Next Story