- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీఆర్సీ ఫైల్ పై సీఎం తక్షణమే ప్రకటన చేయాలి : ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్
దిశ, అచ్చంపేట : ఉద్యోగుల నూతన పీఆర్సీ పై రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే ప్రకటన చేయాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. సదానందం గౌడ్, జుట్టు గజేందర్ అన్నారు.

దిశ, అచ్చంపేట : ఉద్యోగుల నూతన పీఆర్సీ పై రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే ప్రకటన చేయాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. సదానందం గౌడ్, జుట్టు గజేందర్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగుల పీఆర్సీ నివేదికను తెప్పించుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈహెచ్‌ఎస్ పథకాన్ని అమలు చేయాలన్నారు.
ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించాలి
ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించాలని, అలాగే రెగ్యులర్ ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పోస్టులకు పదోన్నతులివ్వాలని డిమాండ్ చేశారు. జీవో 190 ప్రకారం ఇంటర్ లోకల్ డిప్యూటేషన్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఇందులో పాఠశాల విద్యాశాఖ హేతుబద్దీకరణ పేరుతో ఖాళీ పోస్టులకు ఆంక్షలు విధించడం సరి కాదన్నారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని, దానికి అవసరమైన విద్యా హక్కు చట్టం సవరణ చేయాలని డిమాండ్ చేశారు. టంగాపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ గావించిన వగ్గు సుదర్శన్ ను ఘనంగా సన్మానించారు.






