నిరుద్యోగుల హామీల అమలు కోసం పోరు దీక్ష

by Ratna Kumari |

విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనే డిమాండ్ తో గద్వాలలో పోరుకు దీక్ష చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.

నిరుద్యోగుల హామీల అమలు కోసం  పోరు దీక్ష
X

దిశ, అలంపూర్ టౌన్ : విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనే డిమాండ్ తో గద్వాలలో పోరుకు దీక్ష చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ నెల 30న నిర్వహిస్తున్న పోరు దీక్ష పోస్టర్ ని శుక్రవారం అలంపూర్ పట్టణంలోని హరిత టూరిజం లో అలంపూర్ మున్సిపల్ చైర్మన్ జయరాముడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, కుర్వ పల్లయ్య తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే పెండింట్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు 10000 వేల కోట్లును విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, విద్యా రంగానికి 15% బడ్జెట్ కేటాయిస్తాం అని, ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యాభరోసా కార్డులు అమలు చేస్తామని తెలిపారు. ఇంతవరకు అమలు చేయకుండా మోసం చేస్తుందని విమర్శించారు. నిరుద్యోగులను, విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి కాలం గడుపుతుందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు BRSV ఉద్యమం ఆగదు విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటాం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ విక్రమ్, మాజీ సింగల్ విండో చైర్మన్ మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకట రామయ్య శెట్టి, మైనారిటీ నాయకులు రుక్కు, ఖలీల్, షబ్బీర్, మహబూబ్, విద్యార్థి విభాగం నాయకులు రాజేష్, రమేష్ నాయుడు, సుధాకర్ జగ్గుజీవన్, దివాకర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Next Story