- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా వ్యాప్తంగా అక్రమ కార్యకలాపాలపై గట్టి నిఘా : ఎస్పీ జానకి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృత స్థాయిలో 'నాఖాబంది' కార్యక్రమం చేపట్టారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృత స్థాయిలో 'నాఖాబంది' కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, అక్రమ రవాణా, మత్తు పదార్థాలు, అక్రమ ఆయుధాలు, అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు, 6 కార్లు, 12 ఆటోలు గుర్తించబడగా, వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ, జిల్లాలో శాంతి భద్రతలను పటిష్టంగా ఉంచడం, నేరాలకు అడ్డుకట్ట వేయడం, ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారి పై కఠిన చర్యలు తప్పవని, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, ఏవైనా అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి నాఖాబంది తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.






