విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోతే కఠిన చర్యలు : కలెక్టర్ విజయేందిర బోయి

by Nallavelli.Anjaneyulu |

దిశ, దేవరకద్ర : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుండా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. బుధవారం

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోతే కఠిన చర్యలు :  కలెక్టర్ విజయేందిర బోయి
X

దిశ, దేవరకద్ర : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుండా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. బుధవారం దేవరకద్ర మండలం కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం ను బుధవారం కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలో ఆవరణను పరిశీలించి.. పాఠశాల ఆవరణం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపాలని పంచాయతీ రాజ్ ఈఈ ని ఆదేశించారు. ప‌దోతరగతి తెలుగు మీడియం తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ఆహార నాణ్యత ఎలా ఉంది విద్యార్థులని అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పదో తరగతి వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత శాతం సాధించాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాల‌ని సూచించారు. కేజీబీవీలో ఉన్న త‌ర‌గ‌తి గ‌దుల‌ను, కంప్యూట‌ర్ లాబ్ వంట గ‌దుల‌ను, స్టోర్ రూమ్ త‌నిఖీ చేశారు. కేజీబీవీ స్టోర్ రూమ్ లో ఉన్న‌టువంటి వ‌స్తువుల నాణ్య‌త‌, స్టాక్ రిజిస్ట‌ర్ ను ప‌రిశీలించారు. అలాగే మ‌ధ్యాహ్న భోజ‌నం కూడా ప‌రిశీలించారు. సాంబార్ లో సొరకాయ, క్యారేట్ లేకుండా నీళ్ల లాగా చేయడం గమనించి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ కమిటీ ప్రతి రోజు పరిశీలించాలని.. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. మెనూ పాటించకుండా నాణ్యమైన భోజనం అందించకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అధికారులు పాల్గొన్నారు.

Next Story