చైనా మాంజా ను అమ్మినా, వాడినా కఠిన చర్యలే : ఎస్ఐ శీనయ్య

by Ratna Kumari |

సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగుర వేయడానికి చైనా మాంజా ను విక్రయించినా, వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ ఎస్ఐ శీనయ్య హెచ్చరించారు.

చైనా మాంజా ను అమ్మినా, వాడినా కఠిన చర్యలే : ఎస్ఐ శీనయ్య
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగుర వేయడానికి చైనా మాంజా ను విక్రయించినా, వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ ఎస్ఐ శీనయ్య హెచ్చరించారు. జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా చైనా మాంజా పై చేస్తున్న తనిఖీల్లో భాగంగా పట్టణంలో ఆయన గాలిపటాలు అమ్ముతున్న షాపులను విస్తృత తనిఖీలు చేస్తూ, షాపు యజమానులు, వినియోగదారుల తో మాట్లాడారు, చైనా మాంజా వినియోగం వల్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పిల్లలు, పక్షులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారని, ఇటీవలే అనేక సంఘటనలు జరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాంజా వినియోగం పై జిల్లా ఎస్పీ జానకి అనేక సమావేశాలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు చేపట్టి తగు సూచనలు కూడా చేశారని తెలిపారు. చైనా మాంజా ను నిల్వ ఉంచినా, విక్రయించినా, వినియోగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎక్కడైనా చైనా మాంజా విక్రయాలు జరిగితే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి పోలీసులకు సమీకరించాలని ఎస్ఐ శీనయ్య విజ్ఞప్తి చేశారు.

Next Story