- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు ఎస్పీ జానకి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : దీపావళి పండుగ సందర్భంగా లైసెన్స్ లేకుండా ఎవరైనా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణ దారులను ఎస్పీ జానకి ఓ

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : దీపావళి పండుగ సందర్భంగా లైసెన్స్ లేకుండా ఎవరైనా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణ దారులను ఎస్పీ జానకి ఓ ప్రకటనలో హెచ్చరికలు జారీచేశారు. నిబంధనల ప్రకారం.. రద్దీ ప్రదేశాల్లో, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్లు, పెట్రోల్ బంకుల సమీపంలో టపాసుల విక్రయం దుకాణాలను ఏర్పాటు చేయరాదని ఆమె సూచించారు. సంబంధిత తహసిల్దార్, ఫైర్ విభాగం, పోలీస్ శాఖ సూచించిన ప్రదేశాల్లో మాత్రమే ఎక్సుప్లోసివ్స్ యాక్ట్ 1884, ఎక్సుప్లోసివ్స్ రూల్స్-2008 ప్రకారం తీసుకున్న లైసెన్స్ తో కూడిన షాపులను నిర్వహించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. లైసెన్స్ గడువు ముగిసిన వారు ముందస్తు అనుమతి/రెన్యూవల్ తీసుకొని మాత్రమే టపాసులను విక్రయించాలని, జిల్లా ప్రజలు కూడా భద్రతా నియమాలను పాటిస్తూ, పిల్లలను పెద్దల పర్యవేక్షణలో టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ జానకి హితవు పలికారు.






