- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీధి కుక్కల దాడులు.. ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి
వీధి కుక్కల సమస్యలు రోజు రోజుకు తీవ్రమవుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు ఊట్కూర్ వార్డు సభ్యుల తో పాటు పలువురు వినతి పత్రం అందించారు.

దిశ, ఊట్కూర్ : వీధి కుక్కల సమస్యలు రోజు రోజుకు తీవ్రమవుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు ఊట్కూర్ వార్డు సభ్యుల తో పాటు పలువురు వినతి పత్రం అందించారు. వీధి కుక్కల దాడులలో పలుమార్లు చిన్నారులు తీవ్రంగా గాయపడినట్లు తెలియజేశారు. అలాగే చెట్లపై నివసించే వానరం ( కోతి ) ను సైతం దాడి చేసి చంపినట్లు పేర్కొన్నారు. పెంపుడు జంతువులతో పాటు పాడి పశువులపై కుక్కలు కుక్కల దాడికి మరణించాయన్నారు. అర్ధరాత్రి వేళ వీధి కుక్కలు చేసే అరుపులకు ప్రజలకు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యపై పలుమార్లు స్థానిక అధికారులు, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వీధికుక్కల నియంత్రణకు తక్షణమే చర్యలు చేపట్టాలని వివరిస్తూ విజ్ఞప్తి చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్, ఉప సర్పంచ్ రమేష్, నరేష్, అనిల్, రవి, మల్లేష్ వార్డు సభ్యులు ఉన్నారు.






