తాడూర్‌లో నకిలీ డీఏపీ కలకలం.. 80 బ్యాగులు సీజ్

by Kodari Anjali |

నకిలీ డీఏపీ ఎరువులు విక్రయిస్తున్న కిరాణా వ్యాపారిని వ్యవసాయ, పోలీస్ అధికారులు కలిసి రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు.

తాడూర్‌లో నకిలీ డీఏపీ కలకలం.. 80 బ్యాగులు సీజ్
X

దిశ, నాగర్ కర్నూల్ /తాడూర్: తాడూర్ మండలంలోని అకునేల్లికుదురు గ్రామంలో నకిలీ డీఏపీ ఎరువులు విక్రయిస్తున్న కిరాణా వ్యాపారిని వ్యవసాయ, పోలీస్ అధికారులు కలిసి రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. సోమవారం మండల వ్యవసాయ అధికారి సందీప్ కుమార్ రెడ్డి, ఏఈఓ మేఘనాథ్, ఏఎస్ఐ బాలు నాయక్, కానిస్టేబుల్ నరసింహ కలిసి మండలంలోని ఆకు నెల్లికుదురు గ్రామంలో నకిలీ డీఏపీపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా అదే గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారి ముచ్చర్ల చంద్రమౌళి నకిలీ డీఏపీ బ్యాగులను రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. రైతులను విచారించి వారి నుండి 80 సంచుల నకిలీ డిఏపి సంచులను స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ అధికారి సందీప్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ బాలు నాయక్ కేసు నమోదు చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు నకిలీ ఎరువుల బారిన పడొద్దని, ఎల్లప్పుడూ అధీకృత డీలర్ల వద్దనే బిల్లుతో ఎరువులు కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారి కోరారు. నకిలీ ఎరువుల విక్రయాలపై సమాచారం ఉంటే 100 లేదా వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Next Story