- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమాచారం ఇవ్వకపోవడంతో డీఆర్డీఓ, ఏపీఓలకు రాష్ట్ర సమాచార కమిషన్ నోటీసులు
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన సమాచారాన్ని అందించకపోవడంతో నారాయణపేట జిల్లా డీఆర్‌డీఓ (పీడీ) ఊట్కూర్ మండల ఉపాధి హామీ ఏపీఓలకు రాష్ట్ర సమాచార కమిషన్ నోటీసులు జారీ చేసినట్లు సమాచార హక్కు చట్టం పరిరక్షణ ఐక్యవేదిక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు కొనింటి నర్సింహులు తెలిపారు.

దిశ, ఊట్కూర్ : సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన సమాచారాన్ని అందించకపోవడంతో నారాయణపేట జిల్లా డీఆర్‌డీఓ (పీడీ) ఊట్కూర్ మండల ఉపాధి హామీ ఏపీఓలకు రాష్ట్ర సమాచార కమిషన్ నోటీసులు జారీ చేసినట్లు సమాచార హక్కు చట్టం పరిరక్షణ ఐక్యవేదిక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు కొనింటి నర్సింహులు తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లాలో 2019 నుంచి జీవో నెం.499 ప్రకారం.. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ల వివరాలు, మొగ్ధంపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగినట్టు ఆరోపణలు ఉన్న అక్రమాలు, రికవరీలు, సామాజిక తనిఖీలకు సంబంధించిన సమాచారం కోరుతూ దరఖాస్తులు సమర్పించినప్పటికీ అధికారులు స్పందించలేదన్నారు. దీంతో సమాచార హక్కు చట్టం కింద అప్పీలు దాఖలు చేయగా.. కేసును విచారణకు స్వీకరించిన రాష్ట్ర సమాచార కమిషన్ ఈ నెల 15న ఉదయం 10 గంటలకు విచారణ నిర్వహించనున్నట్లు తెలిపారు. విచారణకు నారాయణపేట జిల్లా డీఆర్‌డీఓ (పీడీ), మండల ఏపీఓ హాజరు కావాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టాన్ని సమర్థంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని కొనింటి నర్సింహులుపేర్కొన్నారు.






