సామాజిక న్యాయం ప్రాతిపదికగా పురోగమిస్తున్నాం.. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 20 |
సామాజిక న్యాయం ప్రాతిపదికగా పురోగమిస్తున్నాం.. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సారథ్యంలో రాష్ట్రంలో సృష్టితున్న సమానత్వం, సంపదను సమాజిక న్యాయం ప్రాతిపదికగా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం పురోగమిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల కార్యలయ భవనసముదాయం ఆవరణంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల స్తుపానికి నివాళ్ళు అర్పించారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రదర్శనశాలలను మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు.

విద్యార్థులు ప్రదర్శించిన సంస్కృత కార్యక్రమాలు పలువురిని అలరించాయి. వనపర్తి జిల్లా ప్రగతి నివేదికను చదివివినిపించారు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలు పూర్తీ చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభసందర్భంలో జూన్ 2 వతేది నుండి 22 వ తేదీ వరకు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలలో ప్రజలందరూ భాగస్వాములై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. వనపర్తి జిల్లాలో విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలలో మునుపేన్నడు లేని అభివృద్ది సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మెన్ లోక్ నాథ్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, జిల్లా అదనపు కలెక్టర్ లు వేణు గోపాల్, కృష్ణయ్య, జిల్లా ఎస్పీ రక్షితా కే మూర్తి, ఆర్డీవో పద్మావతి, మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మన్ గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల జిల్లాఅధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Next Story