- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంజూరైన పనులు మొదలు పెట్టండి
మంజూరైన పనులను వెంటనే మొదలుపెట్టాలి అని దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ కోరారు.

దిశ, భూత్పూర్ : మంజూరైన పనులను వెంటనే మొదలుపెట్టాలి అని దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ కోరారు. బుధవారం భూత్పూర్ మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశం, కో ఆప్షన్ సభ్యుల నియామక కార్యక్రమాలకు హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ పాలకోటి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్టు తెలిపారు. మంజూరైన పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలి అని సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. అవసరమైన చోట్ల కొత్త పార్కుల ఏర్పాటు, డ్రైనేజీ కాలువలు నిర్మాణాలు అవసరం ఉంటే వెంటనే గుర్తించి ప్రణాళికలను సిద్ధం చేయాలని చైర్మన్, మున్సిపల్ కమిషనర్, సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా రూపొందించాలని ఎమ్మెల్యే కోరారు.
కోఆప్షన్ సభ్యులకు నియామక పత్రాల అందజేత
నూతనంగా కోఆప్షన్ సభ్యులుగా నియామకమైన కోరే పవన్ కుమార్, లావణ్య, తన్వీర్ సుల్తానా, అప్రోజ్ కు ఎమ్మెల్యే నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.






