Srisailam Dam : ఏ క్షణమైనా ఓపెన్ కానున్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు

by Batti.Sumithra |   (  Updated:2025-07-07 05:05:52  IST  )

ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.

Srisailam Dam : ఏ క్షణమైనా ఓపెన్ కానున్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు
X

దిశ, అచ్చంపేట : ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. అదే విధంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా నది పరుగులు పెడుతూ శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద జలాలు దిగువకు విడుదలవుతున్నాయి. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. సోమవారం ఉదయం నాటికి జూరాల నుంచి 1.98 లక్షల క్యూసెక్కుల వరద జలాలు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరాయి.

ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 880.40 అడుగులకు చేరింది. ఇది ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం అయిన 885 అడుగులకు కేవలం 5 అడుగులు తక్కువ. వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైనప్పుడు ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటిమట్టం మిగిలింది 5 అడుగులే..

ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1.98 లక్షల క్యూసెక్కుల వరద జలాలు వచ్చి చేరుతున్న సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మొత్తం సామర్థ్యం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 880.40అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 215. 8070 సామర్ధ్య ఉండగా సోమవారం ఉదయం నాటికి 190.300 టీఎంసీల సామర్థ్యానికి చేరుకున్నట్లు అధికారులు బుల్లెట్ ను విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరేందుకు కేవలం ఏడడుగులు మాత్రమే మిగిలి ఉండడంతో ఏ క్షణమైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి 1.75 లక్షల క్యూసెక్కుల వరద చేరుతుండగా జూరాల విద్యుత్ పవర్ హౌస్ ద్వారా 29, 236 వేల క్యూసెక్కులు, పై ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా 79,440 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, సుంకేసుల 66,589 వేల క్యూసెక్కులు రాగ, హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి నిల్ కాగా మొత్తంగా వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతూనే ఉన్నది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి 31,704 క్యూసెక్కులు కాగా, తెలంగాణ విద్యుత్తు ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల నీటిని వాడుతూ మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి కోసం 59,239 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వదులుతున్నారు.

Next Story