నిఖిత మృతికి నిరసనగా.. శ్రీశైలం-హైదారాబాద్ జాతీయ రహదారి దిగ్భందం

by samatah |

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననుర్ గ్రామాల గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో గత నెల 6న అనుమానాస్పదంగా మరణించిన నిఖిత కేసులోని నిందితులను,

నిఖిత మృతికి నిరసనగా.. శ్రీశైలం-హైదారాబాద్ జాతీయ రహదారి దిగ్భందం
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననుర్ గ్రామాల గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో గత నెల 6న అనుమానాస్పదంగా మరణించిన నిఖిత కేసులోని నిందితులను, కఠినంగా శిక్షించకపోవడంతో, గత నెల రోజుల నుంచి బాధితురాలి కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షపార్టీలు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రతిపక్షాలతో కలిసి శనివారం హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి దిగ్భందానికి పిలుపునివ్వడంతో నియోజకవర్గంలో నలుమూలల నుండి నాయకులు అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా వద్దకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా అచ్చంపేట డీఎసీపి కృష్ణ కిషోర్ ఆదేశాలతో నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్ నుండి పెద్ద ఎత్తున పోలీసులు ఆదీపూర్ చౌరస్తా వద్ద మోహరించారు.

Next Story