వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

by Disha Web Desk 11 |
వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: మేళ తాళాలు, వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక శోభ నడుమ నారాయణపేట జిల్లా కేంద్రంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ స్వాతి రెడ్డి దంపతుల నేతృత్వంలో గత ఐదు రోజుల పాటు సుందరకాండ పారాయణం నిర్వహించారు. సుందరకాండ పారాయణం ముగింపు కార్యక్రమంలో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ, రామ పట్టాభిషేకం కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎస్పీ వెంకటేశ్వర్లు, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్యాసం రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ముందుగా స్వామి వారి ఉత్సవ మూర్తులను స్థానిక గొడుగేరి శ్రీ హనుమాన్ ఆలయం నుంచి సన్నాయి వాయిద్యాలతో జీపీ శెట్టి ఫంక్షన్ హాల్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవ విశిష్టతను పి. శ్రీనివాస్ రావు భక్తులకు వివరించారు. కార్యక్రమం అనంతరం స్వామివారి ప్రసాద వితరణగా భోజన ఏర్పాట్లను చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బదులు తలెత్తకుండా స్థానిక పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ, వైస్ చైర్మన్ హరి నారాయణ భట్టాడ్, ఎంపీపీ అమ్మ కోళ్ల శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేపూరి రాములు, డీఎస్పీ కె. సత్యనారాయణ, బీజేపీ నాయకులు నాగూరావు నామాజీ, కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ సత్యనారాయణ, కౌన్సిలర్లు జొన్నల అనిత సుభాష్, మేఘా శ్రీపాద్ కులకర్ని, బసపురం నారాయణమ్మ, దొడ్డి వరలక్ష్మి, సరితా సతీష్ గౌడ్, బండి రాజేశ్వరి శివరాంరెడ్డి, అమ్మపల్లి శిరీష చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed