- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు : ఎస్పీ టీ. శ్రీనివాసరావు
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు : ఎస్పీ టీ. శ్రీనివాసరావు
by Ratna Kumari |
దిశ, గద్వాల క్రైమ్ : దుష్ట శక్తులపై విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి పండుగ సందర్భంగా అందరికీ విజయాలు కలగాలని జిల్లా

X
దిశ, గద్వాల క్రైమ్ : దుష్ట శక్తులపై విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి పండుగ సందర్భంగా అందరికీ విజయాలు కలగాలని జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విజయదశమి ప్రజల జీవితాల్లో తేజస్సు, విజయాన్ని తేవాలని ఆకాంక్షించారు. పండుగ ఉత్సవాలు సంతోషకరమైన వాతావరణంలో ఆరోగ్యకరంగా అందరూ కలిసి మెలిసి సోదరభావంతో జరుపుకోవాలి. పోలీసుశాఖలో ప్రతి అధికారి ప్రజా రక్షణలో అగ్రగామిగా ఉండి, శాఖ గౌరవాన్ని మరింత పెంచే విధంగా పని చేయాలని సూచించారు. పండుగలు ప్రశాంత వాతావరణంలో జరగాలని.. ముఖ్యంగా నవరాత్రుల అనంతరం జరిగే దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు శాంతి యుతంగా నిర్వహించుకోవాలని కోరారు ఎస్పీ శ్రీనివాసరావు.
Next Story






