న‌కిలీ స‌ర్టిఫికెట్లు.. న‌కిలీ స్టాంపుల అక్ర‌మార్కుల‌ను గుర్తించి వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి

by Ratna Kumari |

గ‌ద్వాల జిల్లాలో న‌కిలీ స‌ర్టిఫికెట్లు, న‌కిలీ ప్ర‌భుత్వ స్టాంప్ లు త‌యారు చేస్తూ అమాయ‌కులను మోసం చేస్తున్న దుండ‌గుల‌ను వెంట‌నే శిక్షించాల‌ని భీమ్ ఆర్మీ ఉమ్మ‌డి జిల్లా అధ్య‌క్షుడు మాచ‌ర్ల ప్ర‌కాశ్ పేర్కొన్నారు.

న‌కిలీ స‌ర్టిఫికెట్లు.. న‌కిలీ స్టాంపుల అక్ర‌మార్కుల‌ను గుర్తించి వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి
X

దిశ‌, గ‌ట్టు : గ‌ద్వాల జిల్లాలో న‌కిలీ స‌ర్టిఫికెట్లు, న‌కిలీ ప్ర‌భుత్వ స్టాంప్ లు త‌యారు చేస్తూ అమాయ‌కులను మోసం చేస్తున్న దుండ‌గుల‌ను వెంట‌నే శిక్షించాల‌ని భీమ్ ఆర్మీ ఉమ్మ‌డి జిల్లా అధ్య‌క్షుడు మాచ‌ర్ల ప్ర‌కాశ్ పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో నకిలీ స్టాంపులు, నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి పేదవారిని అమాయకులను మోసం చేసే వారిని కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టర్ రిజ్వాన్ భాషా కి భీమ్ ఆర్మీ నాయకులు విన‌తి ప‌త్రం అందజేశారు. ఈ అక్రమ దందా వెనుక ఉన్న ఎంతటి వారినైనా వదలకుండా కఠినమైన కేసులు నమోదు చేయాలనీ వారు కోరారు. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ఇటువంటి అసాంఘిక శక్తులపై పీడీ (PD) యాక్ట్ ప్రయోగించాలనీ, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ముఠాలను కఠినంగా శిక్షించాలని, నకిలీ ముఠాను వెంటనే గుర్తించి వారిని కఠినమైన చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ నుంచి విజ్ఞప్తి చేశారు. అక్రమార్కులను కఠినంగా ఇక్షించాలని జిల్లా కలెక్టర్ ని వినతిపత్రం ద్వారా భీమ్ ఆర్మీ నాయకులు కోరారు. కార్య‌క్ర‌మంలో మాచర్ల ప్రకాష్ జిల్లా అద్యక్షులు వర్షిత్ పాల్గొన్నారు.

Next Story