- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పేదలకు ఉపాధి హామీ పథకాన్ని దూరం చేస్తున్నారు’: మంత్రి వాకిటి శ్రీహరి
పేదలకు ఉపాధి హామీ పథకాన్ని దూరం చేస్తున్నారు..

దిశ, మక్తల్: పేదలకు ఉపాధి హామీ పథకాన్ని దూరం చేస్తున్నారు.. ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై బుధవారం నియోజకవర్గంలోని అమరచింతలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన దీక్షా కార్యక్రమం చేపట్టగా క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ తీసివేసి విబీజీ రాంజీ పేరు పెట్టడం వల్ల లాభం ఏంటని ప్రశ్నించారు. బాపు అద్దాల గుర్తు పెట్టుకొని స్వచ్చ భారత్ కార్యక్రమం పెట్టుకుని ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తీసివేయడమేంటని బాపూజీ పేరు చెప్పుకొని ప్రపంచ దేశాలు శాంతి మంత్రం జపిస్తుంటే దేశంలో గాంధీ పేరు ఉనికిలో లేకుండా చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.
పేదలకు ఉపాధి హామీ పథకాన్ని దూరం చేస్తున్నారు..
పేదలకు ఉపాధి హామీ పథకాన్ని దూరం చేస్తున్నారని గాంధీజీ ఆలోచనలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన చట్టాలతోనే ప్రతీ పేదవాడు జీవించకలుగుతున్నాడన్నారు. ఒక్క వస్త్రంతోనే స్వాతంత్ర్యంలో అనేక పోరాటాలు చేసి పరాయి పాలకుల నుండి భారతదేశాన్ని విముక్తి చేశాడన్నారు. ఉపాధి హామీ పథకంలో పేరు మార్పుపై నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలన్నారు. బాపు పేరు పెట్టే దాకా పోరాటం కొనసాగిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లు గీత సొసైటీ అధ్యక్షులు నాగరాజు గౌడ్, అమరచింత మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అరుణ్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, రహమతుల్లా. మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.






