క్రీడలు మంచి ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : క్రీడలు మంచి ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, దేహదారుడ్యానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

క్రీడలు మంచి ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : క్రీడలు మంచి ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, దేహదారుడ్యానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ నెట్ బాల్ ఛాంపియన్ షిప్-2025 ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. ఈ సంద‌ర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల‌ ఓర్పు, పట్టుదల, లక్ష్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎక్కువ సంఖ్యలో నిధులు కేటాయిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఒలింపిక్ క్రీడలలో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు పతకాలు సాధించి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహారెడ్డి, రాష్ట్ర నెట్ బాల్ సంఘం అధ్యక్షుడు విక్రం ఆదిత్య, శిరీషారాణి, రాంమోహన్, షరీఫ్, ఉమర్ పాల్గొన్నారు.

Next Story