- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత పెడదోవ పట్టకుండా క్రీడలు కీలకం : మంత్రి వాకిటి శ్రీహరి
దిశ, మక్తల్ : యువత పెడదోవ పట్టకుండా క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. శనివారం

దిశ, మక్తల్ : యువత పెడదోవ పట్టకుండా క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. శనివారం పుణే వేదికగా జరుగుతున్న గ్లోబల్ సైక్లింగ్ ఈవెంట్ ట్రోఫీ టూర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గ్లోబల్ ఈవెంట్ ఇండియాలో జరగడం గర్వకారణమన్నారు. భవిష్యతులో సైక్లింగ్ ఈవెంట్ లు తెలంగాణలో నిర్వహించేలా కృషి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో క్రీడలకు, క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో ఎలాంటి క్రీడా ఈవెంట్ నిర్వహించినా ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని క్రీడలకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం ఇస్తుందని ప్రతి నియోజకవర్గంలో క్రీడలకు ప్రోత్సహించే రకంగా ప్లే గ్రౌండ్లను క్రీడా పరికరాలను అందిస్తుందని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల యువత ఆరోగ్యంగా ఉంటారని.. అలాగే పోటీతత్వం కూడా పెరుగుతుందని తెలిపారు.






