- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి: కలెక్టర్ సిక్తా పట్నాయక్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకంపై అలసత్వం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు.

దిశ, నారాయణపేట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకంపై అలసత్వం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో జిల్లా వెనుకబడి ఉండటంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు సమన్వయంతో పనిచేసి వారం రోజుల్లో ఇండ్ల నిర్మాణ పనులను వేగంగా చేయించాలని, అవసరమైతే ఒకటి రెండుసార్లు లబ్ధిదారులను కలిసి పనులు చేయించాలన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల లక్ష్య సాధన పై కలెక్టర్ అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపివో లు, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులతో మండలాల వారీగా సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
ఇండ్ల నిర్మాణాలలో దామరగిద్ద మండలం అత్యంత వెనుక బడి ఉండటంపై ఆ మండల ఎంపీడీవో ను సంజాయిషి అడిగారు. పద్దతి మార్చుకోవాలని, పనితీరు మెరుగు పరచుకోవాలని తేల్చి చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలే కాకుండా ఉపాధి హామీ పథకం కింద కూలీలకు వంద రోజుల పని కల్పించడంలో కూడా జిల్లా ప్రగతి మిగతా జిల్లాల కంటే చాలా వెనక బడి ఉందని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఇకపై స్థానికంగానే ఉండాలని కరాఖండిగా తెలిపారు. ఇండ్ల నిర్మాణాలలో టార్గెట్ పూర్తి చేసిన గ్రామాల పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ అభినందించారు.
టార్గెట్ ఎలా రీచ్ అయ్యారో ! మిగతా పంచాయతీ కార్యదర్శులకు తెలియజేయాలని సూచించారు. అలాగే జిల్లాలోని అన్ని గ్రామాలకు కొత్త సర్పంచులు వచ్చారని, వారితో సమన్వయం చేసుకుని పరిపాలనను ముందుకు సాగించాలని, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా కార్యదర్శులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో ఆస్తి పన్ను వసూళ్ల పై దృష్టి పెట్టాలని తెలిపారు. వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ప్రగతిని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని, లక్ష్యసాధన పై దృష్టి పెట్టని వారిపై చర్యలు తీసుకుంటారని ఆమె స్పష్టం చేశారు. ఈ సమీక్షలో హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.






