- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీర్ధ యాత్రలకు ప్రత్యేక రైళ్లు
తీర్థయాత్రలకు వెళ్ళే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక 'భారత్ గౌరవ్ టూరిస్ట్' రైళ్ళను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఐ.ఆర్.సి.టి.సి టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పీ.వీ. వెంకటేష్ తెలిపారు.

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తీర్థయాత్రలకు వెళ్ళే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక 'భారత్ గౌరవ్ టూరిస్ట్' రైళ్ళను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఐ.ఆర్.సి.టి.సి టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పీ.వీ. వెంకటేష్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిపిఆర్ఓ ఆఫీస్ లో డిపిఆర్ఓ శ్రీనివాస్ కరపత్రాలను ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్ర ప్రజల కోసం ఏప్రిల్ 28 నుంచి జూన్ 12 వరకు 4 ప్రత్యేక ప్యాకేజీలను 'భారత్ గౌవర్ టూరిస్ట్ రైలు' ద్వారా హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుందని, యాత్ర వివరాలు, చార్జీలు ఈ కర పత్రాల్లో వివరంగా ఉన్నాయని అన్నారు. వివరాలకు 9701360701, 9281030733, 9281030734, 9281030744, 9281030759 లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. డిపిఆర్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ సుఖమైన ప్రయాణం కోసం ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Next Story






