అచ్చంపేటలో వైన్ షాపుల ఇష్టారాజ్యం!

by velandi.Saikiran |

అచ్చంపేట పట్టణంలో వైన్ షాపుల యాజమానులు ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

అచ్చంపేటలో వైన్ షాపుల ఇష్టారాజ్యం!
X

*రాష్ట్రం మొత్తం ఒక తీరు, అచ్చంపేటలో మరో తీరు*

*అచ్చంపేటలో వైన్ షాపుల ఇష్టారాజ్యం*

దిశ, అచ్చంపేట రూరల్: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో వైన్ షాపుల యాజమానులు ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. “ప్రభుత్వ నిబంధనలతో మాకు సంబంధం లేదు… మా ఇష్టం వచ్చినప్పుడు షాప్ తెరుస్తాం, ఇష్టం వచ్చినప్పుడు మూసేస్తాం… మమ్మల్ని ఆపేదెవరు?” అంటూ బహిరంగంగానే సవాల్ విసురుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన సమయాలకు విరుద్ధంగా తెల్లవారుజామునే షాపులు తెరవడం, అర్ధ‌రాత్రి వరకు మద్యం విక్రయాలు కొనసాగించడం అచ్చంపేటలో సాధారణ విషయంగా మారిపోయిందని పట్టణ ప్రజలు చెబుతున్నారు.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం కఠినంగా అమలు చేసే నిబంధనలు ఇక్కడ మాత్రం కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు. అబ్కారీ శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించు కోకపోవడంతో వైన్ షాప్ యాజమానులు రెచ్చిపోతున్నార‌ని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స‌మ‌స్యపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల‌ని కోరుతున్నారు జ‌నాలు.

Next Story