మహాశివరాత్రికి భక్తులకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ జానకి

by Ratna Kumari |

మహాశివరాత్రి సంద‌ర్భంగా ప్రధాన శివాలయాలకు భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేయాలని ఎస్పీ జానకి సంబధిత అధికారులను ఆదేశించారు.

మహాశివరాత్రికి భక్తులకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు :  ఎస్పీ జానకి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఆదివారం జరగనున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ప్రధాన శివాలయాలకు భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ జానకి సంబధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రముఖ శివాలయాలైన కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయం, మన్యంకొండ శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి క్షేత్రం పరిసరాల్లోని శివాలయాలు, పట్టణంలోని వీరన్నపేట పెద్ద శివాలయం, పిల్లలమర్రి సమీపంలోని శివాలయం, తదితర ప్రాంతాలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలోని ఇతర ముఖ్య మండల కేంద్రాలలో కూడా భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ, అత్యవసర సేవలు, ప్రజల భద్రత కోసం తగిన పోలీసు సిబ్బందిని నియమించాలని సూచించారు. జిల్లా ప్రజలకు, విధుల్లో పాల్గొంటున్న పోలీస్ సిబ్బందికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాంతి, సౌభ్రాతృత్వం, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాలని ఆకాంక్షించారు.

Next Story