- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దసరా ఉత్సవాలకు మహారాష్ట్ర నుంచి ప్రత్యేక బ్యాండ్ : మంత్రి వాకిటి శ్రీహరి
దిశ, మక్తల్ : దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మహారాష్ట్ర నుంచి ప్రత్యేక బ్యాండ్ తీసుకొచ్చి.. అమ్మవారి వేషధరణలో పట్టణ

దిశ, మక్తల్ : దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మహారాష్ట్ర నుంచి ప్రత్యేక బ్యాండ్ తీసుకొచ్చి.. అమ్మవారి వేషధరణలో పట్టణ పురవీదుల్లో శోభా యాత్ర కొనసాగుతుందని మత్స్యశాక మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. శోభ యాత్రను ఉత్తర భారతదేశంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. విజయదశమి రోజు నల్లజానమ్మ ఆలయం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక పూజలు చేసి శోభయాత్రను ఆధ్యాత్మికవేత్తలు, ధార్మిక సంస్థలు, అఖిల పక్షనాయకులు, రాజకీయ ప్రముఖులు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
ఈ శోభ యాత్ర నల్ల జానమ్మ ఆలయం నుంచి పాతబజార్, నేతాజీ నగర్, వాకిటి వీధి, మారుతినగర్, యాదవ నగర్, గోపాలస్వామి మందిరం పాత టాకీస్, బ్రాహ్మణవాడ, ఆజాద్ నగర్ మీదుగా రాంలీల మైదానం వరకు చేరుకొని విజయదశమిని పురస్కరించుకొని సాయంత్రం నిర్వహించే రావణ దహన కార్యమంతో ముగింపు ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఎక్కడ జరగనివిధంగా శోభయాత్ర జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.






