35 ఏళ్ల కల.. 122 కిలో మీటర్ల ట్రాక్..!

by velandi.Saikiran |   (  Updated:2026-05-03 22:30:43  IST  )

కొడంగల్ ఇప్పుడు అభివృద్ధికి అసలైన చిరునామాగా మారు తోంది. దశాబ్దాలుగా ఎన్నికల మేనిఫెస్టోలకే పరిమితమైన వికారాబాద్ - కృష్ణ రైల్వే లైన్ కల ఇ ప్పుడు సాకారం కాబోతోంది.

35 ఏళ్ల కల.. 122 కిలో మీటర్ల ట్రాక్..!
X

ఊపందుకున్న రైల్వే లైన్

l వికారాబాద్- కృష్ణ రైల్వే లైన్ డీపీఆర్..

రైల్వే బోర్డు ఆమోదం కోసం వెయిటింగ్

l 35 ఏళ్ల కల.. 122 కిలో మీటర్ల ట్రాక్..!

l రూ.2,844 కోట్లతో మారనున్న

వెనుకబడిన ప్రాంతాల తలరాత!

దిశ, కొడంగల్ : రాజకీయ రణక్షేత్రం కొడంగల్ ఇప్పుడు అభివృద్ధికి అసలైన చిరునామాగా మారు తోంది. దశాబ్దాలుగా ఎన్నికల మేనిఫెస్టోలకే పరిమితమైన వికారాబాద్ - కృష్ణ రైల్వే లైన్ కల ఇ ప్పుడు సాకారం కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చే వ్యూహంలో భాగంగా ఈ రైల్వే లైన్ ప్రాజె క్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేవ లం కాగితాలకే పరిమితమైన డీపీఆర్ ఇప్పుడు రైల్వే బోర్డు ఆమోద ముద్ర కోసం వేచిచూస్తోంది.

10.09శాతం ఆర్థిక రాబడి..

ఏ రైల్వే ప్రాజెక్టు పట్టాలెక్కాలన్నా ఆర్థిక లాభదాయకత (రేట్ ఆఫ్ రిటర్న్) కీలకం. వికారాబాద్ - కృష్ణ లైన్ ద్వారా 10.09 శాతం ఆదాయం లభిస్తుందని డీపీఆర్ తేల్చడం ఈ ప్రాంతానికి అతిపెద్ద బలం. ప్రయాణికుల కంటే సరుకు రవాణా ద్వారా రైల్వేకు భారీ ఆదాయం లభించనుంది. ఫలితంగా ఈ ప్రాజెక్టును ఆపడం ఎవరి తరం కాదని, కొడంగల్ సరిహద్దు ప్రాంతాలకు పారిశ్రామిక కళ రావడం ఖాయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

‘టేకల్‌కోడ్’ నిక్షేపాలు..

కొడంగల్ పరిసరాల్లో ముఖ్యంగా టేకల్‌కోడ్ ప్రాంతంలో అపారమైన సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. ఈ రైల్వే లైన్ రాకతో ఇక్కడ భారీ సిమెంట్ పరిశ్రమలు, టెక్స్‌టైల్ పార్కులు వెలిసే అవకాశం ఉంది. దీంతో వలసల జిల్లాగా పేరున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రజలకు తమ సొంత గడ్డపైనే వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

దూరం తగ్గింపు..

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి గోవా, హుబ్లీకి వెళ్లే ప్రయాణికులకు ఈ లైన్ వరప్రసాదం. వికారాబా ద్- కృష్ణ మీదుగా వెళ్లడం వల్ల ప్రయాణ దూరం సుమారు 50 కిలోమీటర్లు తగ్గుతుంది. గంటల తరబడి బస్సు ప్రయాణాలు చేసే కొడంగల్, మ క్తల్, పరిగి ప్రజలకు అత్యంత చౌకైన, వేగవంతమైన రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

‘సీఎం’ చొరవ..

సాధారణంగా భూసేకరణ అడ్డంకులతో రైల్వే ప్రా జెక్టులు దశాబ్దాల తరబడి ఆగుతాయి. కానీ, సీ ఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున భూసేకరణ ఖర్చును భరిస్తామని హామీ ఇవ్వడమే కాకుం డా, ప్రస్తుతం డీపీఆర్ రైల్వే బోర్డు పరిశీలనలో ఉంది. అన్నీ సాఫీగా జరిగితే వచ్చే ఏడాది (20 27) కల్లా క్షేత్రస్థాయిలో పనులు మొదలై, కొడం గల్ గడ్డపై రైలు కూత వినిపించడం ఖాయం.

Next Story