- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ స్టేషన్ కు రాలేని బాధితుల ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు : ఎస్పీ జానకి
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలనుకునే బాధితుడు, పోలీస్ స్టేషన్ కు రాలేని పరిస్ధితుల్లో ఉంటే, బాధితుడి ఇంటి వద్దకే పోలీసులు వచ్చి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానాన్ని తెలంగాణ పోలీస్ అమలు చేస్తుందని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలనుకునే బాధితుడు, పోలీస్ స్టేషన్ కు రాలేని పరిస్ధితుల్లో ఉంటే, బాధితుడి ఇంటి వద్దకే పోలీసులు వచ్చి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానాన్ని తెలంగాణ పోలీస్ అమలు చేస్తుందని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. లైంగిక నేరాలు, హత్యాయత్నం, గాయపరిచే ఘటనలు, దొంగతనం, దోపిడీ, చోరీ వంటి, ఆస్తి సంబంధిత కేసులు, అలాగే పోక్సో, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, బాల్య వివాహా నిరోధక చట్టాల వంటి తదితర నేరాలలో బాధితులు పోలీస్ స్టేషన్ కు రాలేని పరిస్ధితుల్లో ఫోన్ ద్వారా సమాచారం అందించిన యెడల వెంటనే పోలీసు వారు, వారి నివాసం లేదా తమకు అనుకూలమైన ప్రదేశానికి వెళ్లి ఫిర్యాదు స్వీకరిస్తారని ఆమె వివరించారు. ఒకవేళ ఫిర్యాదుదారు రాయలేని పరిస్ధితుల్లో పోలీస్ వారే బాధితుని వాంగ్మూలం, వారి భాషలోనే నమోదు చేసి చదివి వినిపించి వారి సంతకం తీసుకుని అక్కడి నుండే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఫిర్యాదుదారునికి ఎఫ్ఐఆర్ కాపీ అందజేయబడుతుందని ఎస్పీ తెలిపారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లల కేసుల్లో మహిళా పోలీస్ అధికారిణి ఉంటుందని, అవసరమైతే ఇంటర్ ప్రెటర్ లేదా ప్రత్యేక ఉపాధ్యాయుల సమక్షంలో వాంగ్మూలం తీసుకుంటారని ఆమె అన్నారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, బలహీన పరిస్ధితుల్లో ఉన్న బాధితులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, అర్హులైన ప్రజలు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఎస్పీ జానకి తెలిపారు.






