పంచాయతీ ఎన్నికలు పకడ్బంధీతో ప్రశాంతంగా సాగాలి : ఎస్పీ జాన‌కి

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఈనెల 11న గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు జ‌రుగ‌నుండ‌టంతో పకడ్బందీతో ప్రశాంతంగా సాగాలని.. ప్రతి పోలీస్ అప్రమత్తతో విధులు నిర్వహించాలని ఎస్పీ జానకి సూచించారు.

పంచాయతీ ఎన్నికలు పకడ్బంధీతో ప్రశాంతంగా సాగాలి : ఎస్పీ జాన‌కి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఈనెల 11న గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు జ‌రుగ‌నుండ‌టంతో పకడ్బందీతో ప్రశాంతంగా సాగాలని.. ప్రతి పోలీస్ అప్రమత్తతో విధులు నిర్వహించాలని ఎస్పీ జానకి సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం కవాతు మైదానంలో పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆమె ఎన్నికల విధులపై సమగ్ర బ్రీఫింగ్ సమావేశం నిర్వహించారు. మొదటి విడతగా 139 గ్రామ పంచాయతీల్లో జరగాల్సిన ఎన్నికలు 7 స్థానాల్లో ఏకగ్రీవం అయ్యాయని, మిగతా 132 స్థానాల్లో ఎన్నికయ్యే సర్పంచ్ స్థానాల్లో 28 సమస్యాత్మక, 104 సాధారణ గ్రామాలు ఉన్నాయని ఆమె వివరించారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అక్రమాలు చోటుచేసుకోకుండా, ప్రతి పోలీస్ యూనిట్ సమన్వయంతో పనిచేసి ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలను కఠినంగా అణిచివేసే విధంగా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు. మొత్తం 167 పోలింగ్ లొకేషన్లలో 1188 పోలింగ్ స్టేషన్లు ఉండగా, ఇందుకు గాను 39 రూట్ మొబైల్ పార్టీలు, 5 స్ట్రైకింగ్, 5 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లు నియమించడం జరిగిందని ఆమె తెలిపారు. మొత్తానికి 1 ఎస్పీ, 2 అదనపు ఎస్పీలు, 3 డిఎస్పీ లు, 16 గురు సీఐ/ఆర్ఐ లు, 57 మంది రిజర్వు ఎస్సైలను నియమించామని, అలాగే 167 మంది ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుల్స్, 647 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 293 గురు హెడ్ గాడ్స్ లతో సహా మొత్తం 1188 సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ వివరించారు. చిన్న గొడవలైనా తెలికగా తీసుకోకుండా వెంటనే పరిష్కరించి శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలని సూచించారు. అత్యవసర సమాచారం అందగానే పైఅధికారులను అప్రమత్తం చేస్తూ, సమన్వయాన్ని పటిష్టంగా కొనసాగించాలని ఎస్పీ జానకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్బీ రత్నం, సురేష్ కుమార్ డిఎస్పీ లు వెంకటేశ్వర్లు, గిరిబాబు, రమణారెడ్డి, సీఐలు, ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story