అత్యాచార ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

by Naveena |

వివాహితపై సాముహిక అత్యాచార ఘటన దురదృష్టకరమని, నేర స్థలంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసు పక్కగా దర్యాప్తు చేస్తున్నామని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ తెలిపారు.

అత్యాచార ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
X

దిశ, కల్వకుర్తి / ఉర్కొండ : వివాహితపై సాముహిక అత్యాచార ఘటన దురదృష్టకరమని, నేర స్థలంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసు పక్కగా దర్యాప్తు చేస్తున్నామని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. సోమవారం ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, సిఐ నాగార్జున లు నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండల పరిధిలోని ఉర్కొండపేట శివారులోని అత్యాచార ఘటన స్థలాన్ని, దేవాలయ చుట్టుపక్కల పరిశీలించారు. ప్రస్తుతం అత్యాచార ఘటనలో నిందితులుగా ఉన్న ఏడుగురిని ఆధారాలతో గుర్తించామన్నారు. బాధితురాలి వద్ద బంగారు వస్తువులు దొంగిలించారని ,ఇంకేవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నామన్నారు. నిందితులు వైల్డ్ గా అనుసరించారని కేసు దర్యాప్తు లో ఇంకొన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నట్లు ఎస్పీ తెలిపారు. వైద్య చికిత్స నిమిత్తం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.

Next Story