లోక్ అదాలత్ లో భారీగా పోలీస్ శాఖ కేసుల పరిష్కారం : ఎస్పీ జానకి

by Ratna Kumari |

మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల, మహబూబ్ నగర్ కోర్టుల్లో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో పోలీస్ శాఖ కు సంబంధించిన పెండింగ్ కేసులను పరిష్కరించి విశేష ఫలితాలు సాధించినట్లు ఎస్పీ జానకి వెల్లడించారు.

లోక్ అదాలత్ లో భారీగా పోలీస్ శాఖ కేసుల పరిష్కారం :  ఎస్పీ జానకి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల, మహబూబ్ నగర్ కోర్టుల్లో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో పోలీస్ శాఖ కు సంబంధించిన పెండింగ్ కేసులను పరిష్కరించి విశేష ఫలితాలు సాధించినట్లు ఎస్పీ జానకి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా పోలీస్ శాఖకు సంబంధించిన 3,416 కేసుల పరిష్కరించి, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి పోగొట్టుకున్న 42,97,445 నగదును తిరిగి అందజేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. పరిష్కరించిన కేసుల్లో 524 ఐపీసీ, 794 డీడీ కేసులు, 1979 ఈపెట్టీ కేసులు, అలాగే 119 సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారంతో బాధితులకు తక్షణ న్యాయం అందించడంతో పాటు కోర్టులపై ఉన్న భారం కూడా తగ్గించినట్లు అయిందని ఆమె వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా వివాదాలను వేగంగా, స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవడం వలన డబ్బు, సమయం ఆదా అయి, ప్రయాస తగ్గి ప్రశాంతత చేకూరుతుందని ఎస్పీ జానకి పేర్కొన్నారు. ఈ పరిష్కారానికి సహకరించిన న్యాయవాదులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, ఆయా సంబంధిత శాఖల వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Next Story