మహిళలకు భద్రత కల్పించినప్పుడే సమాజానికి భరోసా

by Elthuri vijay kumar |

మహిళలు, బాలికలు, పిల్లలకు భద్రత కల్పించినప్పుడే సమాజానికి భరోసా ఇచ్చినట్లేనని సీఐడీ ఎస్పీ అన్యోన్య అన్నారు.

మహిళలకు భద్రత కల్పించినప్పుడే సమాజానికి భరోసా
X

మహిళలకు భద్రత కల్పించినప్పుడే సమాజానికి భరోసా

-సీఐడీ ఎస్పీ అన్యోన్య

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: మహిళలు, బాలికలు, పిల్లలకు భద్రత కల్పించినప్పుడే సమాజానికి భరోసా ఇచ్చినట్లేనని సీఐడీ ఎస్పీ అన్యోన్య అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో భరోసా, షీ టీం,ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, కళాబృందం సభ్యులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలు, పిల్లల భద్రత కోసం పోలీసులు చేపట్టే ప్రతి చర్యలో భరోసా, షీ టీమ్, ఏహెచ్టీయూ, కళా బృందం కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ప్రతి జిల్లాలోని ప్రతి పాఠశాల, కళాశాల, బహిరంగ ప్రదేశాలు, గ్రామాలు, సున్నితమైన ప్రాంతాల్లో సదస్సులు,అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. సమాజంలో మైనర్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, గృహహింస, మహిళలపై దాడులు, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలను అరికట్టడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తల్లితండ్రులకు కౌన్సిలింగ్ చేయడం, యువతలో చట్టపరమైన అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని సూచించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డిఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐడీ ఇన్సిపెక్టర్ లక్ష్మణ్, ఉమెన్స్ పీఎస్ సీఐ శ్రీనివాసులు, డిసీఆర్బీ సీఐ మగ్ధూమ్ అలీ, ఎస్ఐ సుజాత తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Next Story