30 వేల నష్టపరిహారం చెల్లించాలని సామాజిక కార్య‌క‌ర్త దీక్ష

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఊట్కూర్ : అధిక వర్షాల కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని.. అందుకు ఎకరాకు 30 వేల రూ. నష్టం చెల్లించాలని సామాజిక కార్యకర్త నరసింహ డిమాండ్ చేశారు.

30 వేల నష్టపరిహారం చెల్లించాలని సామాజిక కార్య‌క‌ర్త దీక్ష
X

దిశ, ఊట్కూర్ : అధిక వర్షాల కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని.. అందుకు ఎకరాకు 30 వేల రూ. నష్టం చెల్లించాలని సామాజిక కార్యకర్త నరసింహ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని బిజ్వార్ గ్రామ స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఒక్కరోజు నిరసన దీక్ష ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల ప్రభావం ఎకరాకు పత్తి కేవలం ఐదు క్వింటాల్ కి మాత్రమే దిగుబడి వచ్చిందని తెలిపారు. కేంద్ర ఆర్థిక, గుణాంక శాఖ డైరెక్టర్ రేట్ పత్తి దిగుబడి తగ్గిందని నివేదిక జారీ చేసినట్లు తెలిపారు. ఎకరాకు కొత్తగా ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటాం అనే నిబంధన ఎత్తివేసి 12 క్వింటాళ్ల పత్తి చేయాలని కోరారు. రైతులకు పూటకు ఒక కొత్త నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. వర్షాలతో పాటు పత్తి దిగుబడి తగ్గడంతో 20% తేమ ఉన్న పత్తి ను సిసిఐ మద్దతు ధర కొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

Next Story